కొంపముంచిన హెల్మెట్.. అవాక్కయిన పార్థివ్ పటేల్?

praveen
క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ప్రతి క్రికెటర్ కూడా రూల్స్ తప్పకుండా పాటించాలి. ఒకవేళ రూల్స్ పాటించక పోతే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పొరపాటున జరిగిన తప్పిదాలకు కూడా చివరికి అంపైర్లు షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండవ ఎడిషన్ లో భాగంగా మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉన్నాయి. అయితే వరల్డ్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా మహారాజ్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేసిన తప్పిదం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక పార్థివ్  పటేల్ పొరపాటున చేసిన తప్పిదం కారణంగా ప్రత్యర్ధి జట్టు వరల్డ్ జెయింట్స్ కు 5 పరుగులు లభించాయి అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో అశోక్ దిండా వేసిన మూడో బంతిని ఫరెరా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ను మిస్ చేసి కీపర్ చేతిలో పడింది. బంతి వేగాన్ని అంచనా వేయలేక పోయిన పార్థివ్ పటేల్ బంతిని క్యాచ్ పట్టాడు. అతని చేతిలో నుంచి జారి పోయిన బండి అతని వెనకాల ఉన్న హెల్మెట్ ను తాకింది బంతి అక్కడే ఆగిపోయింది.


 దీంతో ఇక ఫీల్డ్ అంపైర్ గా ఉన్న వ్యక్తి పెనాల్టీ కింద 5 పరుగులను వరల్డ్ జెయింట్స్ జట్టుకు జత చేయడం గమనార్హం. అయితే ఊహించని ఘటన తో పార్థివ్ పటేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఈ ఘటనకు అక్కడ ఉన్న అశోక్ దిండా, కెప్టెన్ హర్భజన్ సింగ్ కాసేపు నవ్వుకున్నారు అనే చెప్పాలి. కాగా ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.ఆ తర్వాత ఇండియా మహారాజాస్ జట్టు 18.4 ఓవర్లలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: