వైరల్ : మరోసారి సచిన్ అలాంటి షాట్?
ఈ లెజెండరీ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఎన్నో ఏళ్లు గడిచిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించక ముందు ఆడిన ఇన్నింగ్స్ ను చూస్తూ అతని అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు. కానీ ఇటీవలే మరోసారి సచిన్ ఆటను చూసేందుకు అభిమానులకు సువర్ణావకాశం వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా సచిన్ ఇండియా లెజెండ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.. కాన్పూర్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా లెజెండ్స్ తో మ్యాచ్ లో సచిన్ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన సచిన్ కొద్దిసేపు క్రీజులో ఉన్నాడు.
కానీ ఉన్న కొద్ది సేపు కూడా తనదైన బ్యాటింగ్ తో అభిమానులను కూడా అలరించాడు సచిన్ టెండూల్కర్. మాఖయా ఎంటిని బౌలింగ్లో లాఫ్టింగ్ షాట్ తో మరోసారి తన పాత స్టైల్ అభిమానులకు గుర్తుచేశాడు. ఇక సచిన్ టెండూల్కర్ ఆ షాట్ ఆడగానే స్టేడియం లో ఉన్న అభిమానులు అందరూ కూడా కేరింతలు కొట్టారు అని చెప్పాలి. దీంతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. క్రీజ్లో ఉన్నంత సేపు సచిన్ సచిన్ అంటూ గట్టిగా అరిచారు. ఇకపోతే ఇండియా లెజెండ్స్ జట్టు ప్రత్యర్థి ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా. చివరికి 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.