కోహ్లీ ఓపెనర్ అయితే.. నేను డగౌట్ లో కూర్చోవాలా : కేఎల్ రాహుల్

praveen
ఇటీవలే ఆసియా కప్లో భాగంగా టీమిండియా ప్రస్థానం ముగిసింది అనే చెప్పాలి. ఫైనల్కు చేరుకునీ అక్కడ కప్ కొడుతుంది అనుకున్న టీమిండియా చివరికి సూపర్ 4 లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. తద్వారా ఫైనల్ కు వెళ్లే అవకాశాలు కోల్పోయింది అని చెప్పాలి. అదే సమయంలో సూపర్ 4 లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడో మ్యాచ్లో మాత్రం టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో వీర విహారం చేసిన విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు 6 సిక్సర్లు ఉండటం గమనార్హం. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్కు తోడు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో గెలవడంతో భారత జట్టు 110 పరుగుల తేడాతో విజయం సాధించింది.  మరోవైపు కెప్టెన్గా వ్యవహరించిన మరో ఓపెనర్ కె.ఎల్.రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు అన్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడాడు.

 ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి చాలా చిరాకు పడ్డాడు కె.ఎల్.రాహుల్. కోహ్లీ ఓపెనర్గా ఎలా ఆడాడో చూశాం.. ఐపీఎల్ టోర్నీలో కూడా ఓపెనర్ గా రాణించాడు. ఇక రాబోయే ప్రపంచకప్ లో కూడా విరాట్ కోహ్లీనీ ఓపెనర్లుగా చూడొచ్చా అంటూ రిపోర్టర్ ప్రశ్నించాడు.  అంటే ఏంటి ఏంటి కోహ్లీ ఓపెనర్గా వస్తే నేను డగౌట్ లో కూర్చొని మ్యాచ్ చూడాలా అంటూ సమాధానమిచ్చాడు. అయితే కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావడం టీమిండియాకు శుభపరిణామం. మ్యాచ్ నిస్సందేహంగా కోహ్లీదే. ఏ స్థానంలో అయినా కోహ్లీ సెంచరీలు సాధించగలడు అంటూ కేఎల్ రాహుల్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: