కోహ్లీ సెంచరీతో.. వాళ్లందరూ భయపడుతున్నారా?
అభిమానుల అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ ఇటీవలే మునుపటి ఫామ్ సాధించాడు. ఆసియా కప్లో భాగంగా ప్రతి మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు అని చెప్పాలి. కానీ టీం ఇండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. మొన్నటి వరకు బ్యాటింగ్ లో తడబడిన కోహ్లీ ఇటీవల మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో వీరవిహారం చేశాడు అని చెప్పాలి. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి పోతూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పూర్తి ఫామ్లోకి వచ్చాడు అని తెలుస్తోంది.
మళ్లీ పరుగుల వరద పారించటం ఖాయమని అర్ధమవుతుంది. ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఇది ఒక శుభసూచకం అని చెప్పాలి.అయితే విరాట్ కోహ్లీ ఇటీవల సెంచరీ చేసిన నేపథ్యంలో అటు కొంతమందిలో మాత్రం భయం పట్టుకుంది. ఆ కొంతమంది ఎవరో కాదు వరల్డ్కప్ లొ టీమిండియాకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లు. విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు కదా టీం ఇండియాని ఓడించగలం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాను అని చెప్పకనే చెప్పడంతో తమ వ్యూహాలను మొత్తం మళ్లీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోహ్లీ ఇదే ఫాంలో ఉంటే ఇక తమ జట్టు ఇండియాతో ఎంత పోరాడినా కష్టమే అన్న భయం అందరిలో పట్టుకుంది అని చెప్పాలి.