టి20 ఫార్మాట్ లో టాప్ 5 క్రికెటర్లు వీళ్ళే : రికీ పాంటింగ్
ఇటీవలే ఇలాంటి విశ్లేషణ చేసాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు సారథ్య బాధ్యతలు వహించిన రికీ పాంటింగ్ ప్రపంచ క్రికెట్ లో ఒక దిగ్గజ ఆటగాడి గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆస్ట్రేలియా జట్టుకు ఎంతో అద్వితీయమైన విజయాలను కూడా అందించి తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. ఇకపోతే ఇటీవలె రోజురోజుకీ ప్రేక్షకాదరణ పొందుతు టాప్ ఫార్మాటు గా మారిపోయిన టీ-20 ఫార్మెట్లో ప్రపంచ క్రికెట్ లో ఎవరు అత్యుత్తమ ఆటగాళ్లు అన్ని విషయాలను వెల్లడించాడు.
ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ లో ఉన్న టాప్ 5 అత్యుత్తమ క్రికెటర్లు ఎవరు అన్న విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ కు నెంబర్ వన్ స్థానాన్ని ఇస్తున్నట్లు రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.ఇక ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజం రెండో ర్యాంకులో ఉన్నట్లు తెలిపాడు. టీమిండియా నుంచి హార్దిక్ పాండ్య, ఇంగ్లాండ్ జట్టు నుంచి జోస్ బట్లర్, ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా టాప్ ఫైవ్ క్రికెటర్లతో కొనసాగుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి మాత్రం ఎవరిని ఎంపిక చేయకపోవడం గమనార్హం.