ఆసియా కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డోడు?
ఇలా తమ అభిమాన జట్టు ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నా వీడియోలు ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో చివరికి శ్రీలంక విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ గెలుపు ఖాయం అనుకున్న సమయంలో అదృష్టం మాత్రం అటు శ్రీలంక వైపే మళ్ళింది. ఇక ఇలా శ్రీలంక చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
స్వీయ తప్పిదాల కారణంగానే బంగ్లాదేశ్ జట్టు గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి చవిచూడాల్సినా పరిస్థితి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే శ్రీలంకతో మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓటమిని అటు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు.. టీవీల ముందు కూర్చున్న వారు ఏమో కానీ స్టేడియం లో కూర్చున్న అభిమానులు మాత్రం ఓటమిని తట్టుకోలేక పోయారు. కాగా స్టేడియం లో కూర్చుని తన అభిమాన లిస్టు ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన ఒక బుడ్డోడు ఏకంగా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్గా మారిపోయింది అని చెప్పాలి.