రోహిత్ భయపడుతున్నాడు : పాక్ మాజీ కెప్టెన్

praveen
ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. మొన్నటికి మొన్న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను  చిత్తుచేసిన టీమిండియా ఇక ఇటీవలే పసికూన హాంగ్కాంగ్ పై కూడా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  40 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే టీమిండియా విజయాలు సాధిస్తోంది కానీ ఎందుకో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మంచి ఇన్నింగ్స్  ఆడ లేక పోతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో 18 బంతుల్లో 12 పరుగులు హాంకాంగ్ పై మ్యాచ్లో 13 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు.  చివరికి భారీ షాట్లకు ప్రయత్నించి  క్యాచ్ ఇచ్చి ఔట్  అవుతున్నాడు.

 ఈ క్రమంలోనే కెప్టెన్గా అతను వ్యూహాలతో సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా ఒక బ్యాట్స్ మెన్ గా మాత్రం అతను సక్సెస్ కాలేక పోతున్నాడు అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ రోహిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ సంబంధిత ఒత్తిడితో రోహిత్ సతమతమవుతున్నాడు అని చెప్పుకొచ్చాడు.  అంతేకాదు రోహిత్ పని అయిపోయినట్లు కనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్  చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ మైదానం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వీడియో క్లిప్ ని ప్లే చేయమని కోరాడు.

 ఇక ఆ వీడియో క్లిప్ ని చూపిస్తూ రోహిత్ భయపడుతున్నట్లు కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా గెలిచిన తర్వాత కూడా రోహిత్ పేసులో భయపడుతున్నట్లు గా హావభావాలు చూస్తున్నాం. అంతకుముందు టాస్ కి వచ్చినప్పుడు కూడా ఎంతో వీక్ గానే  కనిపించాడు. అ తను ఎంతగానో భయపడుతున్నాడు  అని కంగారు పడుతున్నాడని అతన్ని చూస్తే అర్థమవుతుంది. అద్భుతమైన ఇన్నింగ్స్ లు  ఆడిన  రోహిత్ శర్మ ను ఇప్పుడు చూడలేకపోతున్నాము  అంటూ మహమ్మద్ హఫీస్ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ ఫామ్ రానురాను క్షీణిస్తుందని.. ఇలా పేలవ మైన  ప్రదర్శన చేస్తే ఇక కెప్టెన్గా కూడా అతను ఎక్కువకాలం ఉండే అవకాశం లేకపోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: