న్యూజిలాండ్తో సిరీస్.. టీమిండియాకు షాక్?
ఎందుకంటే భారత ఏ జట్టులో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న ఆటగాడు చివరికి గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా బెంగళూరు వేదికగా నిన్న ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో భాగంగా ప్రసిద్ధి కృష్ణ ఆడలేదు అన్నది తెలిసిందే. అయితే ఆఖరి నిమిషం వరకు భారత జట్టు పటిష్టంగానే ఉంది అని అనుకున్నప్పటికీ.. ఇక చివరి నిమిషంలో ప్రసిద్ కృష్ణ వెన్నునొప్పి కారణంగా తప్పుకోవడంతో ఇక టీమిండియా ఏ జట్టు అనుభవంలేని fఫేస్ దళంతో బరిలోకి దిగింది. అయితే గత కొంత కాలం నుంచి తరచూ వెన్నునొప్పి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ప్రసిద్ కృష్ణ.
ఈ క్రమంలోనే ఇటీవల వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన ప్రసిద్ కృష్ణ.. కేవలం ఒక మ్యాచ్ కి మాత్రమే కాదు పూర్తిగా న్యూజిలాండ్ ఏ జట్టుతో జరగబోయే సిరీస్ కి దూరం కాబోతున్నాడు అన్నది బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా న్యూజిలాండ్ ఏ తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ప్రియాంక్ పంచల్ సారథ్యంలో బరిలోకి దిగింది ఇండియా ఏ జట్టు. తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. ఇకపోతే భారత జట్టు నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ముఖేష్ కుమార్, యాష్ దయాల్, అర్జన్, కుల్దీప్ యాదవ్ లు ఇక టీమిండియా జట్టు బౌలర్లు కాగా. తిలక్ వర్మ పార్ట్ టైం బౌలర్ గా సేవలందించాడు.