చరిత్ర సృష్టించిన.. సూర్య కుమార్ యాదవ్?

praveen
ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అనే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ డైలాగ్ కి  సరిగ్గా సరిపోయే ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు  సూర్య  కుమార్ యాదవ్. కొంతకాలం నుంచి అత్యుత్తమమైన పాన్ కనబరుస్తూ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అంతేకాదు మైదానంలో అన్నివైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడుతూ మిస్టర్ 360  ఆటగాడిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.

 ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే చాలు సిక్సర్లతో చెలరేగి పోతున్నాడు.  బంతి ఎక్కడ వేసినా కూడా దానిని బౌండరీకి తరలించడమే  లక్ష్యంగా బ్యాట్ ఝుళిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని వీరబాదుడు కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. అయితే  మిగతా ఆటగాళ్లతో పోల్చిచూస్తే   కాస్త లేటు వయసులోనే టీమిండియా లో అవకాశం దక్కించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.  అయితేనేం  తక్కువ సమయంలోనే అందరి కంటే ఎక్కువగానే గుర్తింపు సంపాదించుకున్నాడు.

 ఇటీవలే హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఎంతలా వీర విహారం చేసాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. 26 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు 6 సిక్సర్లు ఉండటం గమనార్హం.  కాగా  హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు ఈ స్టార్ బ్యాట్స్ మెన్. సాధారణం గా డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయడం కాస్త కష్టమే.. ఎందుకంటే బ్యాట్స్మెన్ తీవ్ర ఒత్తిడితో ఉంటాడు. కానీ  ఇటీవలే హంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో ఏకంగా 26 పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్.  ఇలా 20వ ఓవర్ లో  అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: