మరోసారి ఇండియా Vs పాకిస్తాన్.. ఎప్పుడంటే?
అయితే భారత్కు సూపర్ 4 లో స్థానం ఖాయమై.. సూపర్ కు చేరిన రెండవ జట్టుగా అవతరించింది అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4 కు చేరింది. కాబట్టి ఇప్పుడు భారత జట్టు వారి గ్రూప్ లో నెంబర్ వన్ స్థానం లో కొనసాగడం ఖాయం అని తెలుస్తోంది. అయితే ఇక ఇప్పుడు అందరి చూపు కూడా సెప్టెంబర్ రెండవ తేదీన జరగబోయే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ పైన ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ గెలిస్తే సూపర్ 4కు చేరుకుంటుంది. ఒకవేళ ఇదే జరిగితే మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అనేది తెలుస్తుంది. సెప్టెంబర్ నాలుగవ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీన గ్రూప్ఏ లో ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు మ్యాచ్ ఉంటుంది. తద్వారా సెప్టెంబర్ 2వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటూ ఉండడం గమనార్హం. ఎందుకంటే పాకిస్తాన్ గెలిస్తే మరోసారి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ని వీక్షించవచ్చని ఇక మరో సారి పాకిస్థాన్ జట్టును భారత్ ఓడిస్తే చూసి ఎంజాయ్ చేయవచ్చని భారత అభిమానుల భావిస్తూ ఉండడం గమనార్హం. మరి రేపు జరగబోయే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.