హమ్మయ్యా.. కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడోచ్?
దీంతో విరాట్ కోహ్లీ మునుపటి అందుకునేందుకు అటు బిసిసిఐ సెలెక్టర్లు కూడా అతనికి కొన్ని నెలలపాటు విశ్రాంతి ఇచ్చారూ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఫ్యామిలీ తో వెకేషన్ ఎంజాయ్ చేశాడు. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా మళ్లీ టీమిండియాతో చేరాడు. కాగా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో అన్న దాని కంటే విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడో అన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన మీద అందరి దృష్టి ఉంది. ఇలాంటి సమయంలో కాస్త తడబడినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మాత్రం మళ్లీ మునుపటి టచ్ టచ్ టచ్ లో కనిపించాడు.
ముప్పై మూడు బంతుల్లో 35 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. పాకిస్తాన్ తో మ్యాచ్ లో జట్టులోని టాప్ స్కోర్ లలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. ఇక ఇటీవలే హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టేశాడు. చెలరేగిపోయి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 59 పరుగులు చేశాడు ఇందులో 1 ఫోర్ 3 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇక కోహ్లీ ఇన్నింగ్స్ చూసిన తర్వాత మా అభిమాన క్రికెటర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు అని అందరూ ఆనందంలో మునిగి పోతున్నారు.