భారత్ vs పాక్ మ్యాచ్ అంటే అంతే.. వ్యూయర్ షిప్ లో రికార్డు?
దశాబ్దాలు గడుస్తున్నా పాకిస్తాన్ భారత్ మాత కి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో.. ఈ మ్యాచ్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్న మ్యాచ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆసియా కప్లో భాగంగా ఇదే జరిగింది అన్నది తెలుస్తుంది. ఇటీవల జరిగిన దాయాదుల పోరు ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించింది.
అంతేకాదండోయ్ వ్యూయర్ షిప్ పరంగా కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ని దాదాపు కోటి మందికిపైగా నెటిజన్లు వీక్షించినట్లు తెలుస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటిటి చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక వ్యూయర్ షిప్ కావటం గమనార్హం. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అత్యధికంగా వీక్షించిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్గా నిలిచింది. అయితే ఓటిటి లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మ్యాచ్ రికార్డు ఐపీఎల్ మ్యాచ్ పేరిట ఉంది. 2019 లో ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరిగిన మ్యాచ్ 18 మిలియన్ల మంది వీక్షించారు. ఇదే ఇప్పుడు భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ని 13 మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం.