పాకిస్తాన్ క్రికెటర్ కు.. అరుదైన గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ?
ఈ క్రమంలోనే అటు పాకిస్థాన్ జట్టు లోనే కాదు పాకిస్తాన్ ప్రేక్షకుల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మొన్నటికి మొన్న పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలిపేందుకు యూఏఈకీ చేరుకున్న పాకిస్తాన్ అభిమానులు రోహిత్ శర్మ కనిపించడంతో సంతోషం లో మునిగిపోయారు. రోహిత్ శర్మ దగ్గరకు పిలిపించుకుని మరీ కరచాలనం చేశారు. ఇక మీరంటే మాకు ఎంతో ఇష్టం మీరు మా ఆరాధ్య క్రికెటర్ అంటూ చెప్పడం గమనార్హం. ఇక ఇప్పుడు ఏకంగా ఒక పాకిస్థాన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వీరాభిమాని అన్న విషయం తెలిసింది. పాకిస్తాన్ యువ పేసర్ హరీష్ రౌఫ్ ఇటీవలే కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
టీం ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత హరీష్ రౌఫ్ తన ఆరాధ్య ఆటగాడితో ముచ్చటిస్తూ తనకు ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని బహుమతిగా ఇవ్వాల్సిందిగా విరాట్ కోహ్లీని కోరాడు. అయితే కోహ్లీ ఈ విషయంలో ఏమాత్రం సంకోచించని విరాట్ కోహ్లీ వెంటనే తన జెర్సీ తెప్పించి దానిపై ఆటోగ్రాఫ్ చేసి హరీష్ రౌఫ్ కు బహుమతిగా ఇచ్చాడు. ఈ బహుమతితో సదరు పాకిస్థాన్ ఆటగాడు ఎంతో సంతోషం గా కనిపించాడు. ఈ వీడియో ని బిసిసీఐ ఇటీవలే ట్విట్టర్లో షేర్ చేయడం తో వైరల్ గా మారిపోయింది.