బాబర్ ను ఔట్ చేసాక.. అలా అనుకోలేదు : భువి

praveen
ఇటీవలే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠ   భరితమైన దాయాదుల పోరు జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది. అటు క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఈ మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించి గత ఏడాది టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది అనే చెప్పాలి.


 అయితే గత కొంత కాలం నుంచి పాకిస్థాన్ జట్టును ఓపెనర్లుగా ఉన్న కెప్టెన్ బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్  లు మాత్రమే ముందుకు నడిపిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా వీరిద్దరూ మంచి ప్రదర్శన చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని గమనించిన టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం బాబర్ అజాం తో పాటు అటు మహమ్మద్ రిజ్వాన్  ను కూడాత్వరగా వికెట్ పడగొట్టాలి అనే లక్ష్యంతో బౌలింగ్ చేసింది అనే చెప్పాలి. అయితే బాబర్ ను ఔట్ చేసిన తర్వాత బలహీన పడి పోయింది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


 ఇదే విషయంపై మాట్లాడినా టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజాం అవుట్ చేసిన తర్వాత పాకిస్తాన్ సగం జట్టును పెవిలియన్ కు పంపామని మేము భావించలేదు. నిజానికి బాబర్  ఒక గొప్ప ఆటగాడు అయితే టెక్నికల్ గా మేము మరో తొమ్మిది మందిని ఔట్ చేయాలి కదా. బెస్ట్ బ్యాటర్ అవుట్ చేసినంత మాత్రాన మేము రిలాక్స్ అవ్వలేదు. కానీ కీలక బ్యాట్స్మెన్ను పెవిలియన్కు పంపి ప్రత్యర్థి జట్టు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ కొట్టి.. ఒక్కసారిగా వారి ప్రణాళికలను చిన్నాభిన్నం చేశాము అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటూ టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: