అండర్సన్ అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్?
350 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు మూడవ రోజు అతను ఈ రికార్డును అందుకోగలిగాడు. సైమన్ హార్నర్ ను అవుట్ చేయడం ద్వారా ఇక ఈ మైలురాయికి చేరువయ్యాడు. 40 ఏళ్ల వయసులో అండర్సన్ అద్భుతమైన బౌలింగ్తో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో ఇక ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఇక జేమ్స్ అండర్సన్ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 951 వికెట్లు అందుకున్నాడు. కాగా ఇది అతనికి 387 మ్యాచ్ కావడం గమనార్హం.
అంతే కాదు మూడు సార్లు 10 వికెట్లు సాధించిన ఘనత కూడా అందుకున్నాడు జేమ్స్ అండర్సన్. కాగా ఇప్పటివరకు టెస్టు ఫార్మాట్లో 664 వికెట్లు వన్డే ఫార్మాట్లో 269 వికెట్లు టి-20 ఇంటర్నేషనల్ లో 18 వికెట్లు పడగొట్టాడు జేమ్స్ అండర్సన్. జేమ్స్ అండర్సన్ వెనక మెక్ గ్రాత్ ఉన్నాడు. మెక్ గ్రాత్ అతని కెరీర్లో 949 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు జేమ్స్ అండర్సన్ ఈ రికార్డును బ్రేక్ చేసి ప్రపంచంలోనే క్రికెట్ లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు మురిసిపోతున్నారు. తనకు తిరుగు లేదు అంటూ చెబుతున్నారు.