ఏపీ లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి..!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి వల్ల చాలామంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం అందరినీ కలిచి వేస్తోంది. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఒక ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. అయితే ఈ బస్సు చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందినదిగా అధికారులు తెలియజేస్తున్నారు.


ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణించగా ఈ ప్రమాదం వల్ల ఇప్పటివరకు సుమారుగా 15 మంది ప్రయాణికులు మృతి చెందారని సమాచారం. ఇందులో ప్రయాణించిన మరి కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు సైతం వెంటనే పోలీసులు, అంబులెన్స్లకు సమాచారం అందించడంతో హుటాహుటిగా ఈ బస్సు ప్రమాదం చోటుకి చేరుకున్నారు. దీంతో వెంటనే ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.



అయితే మృతుల సంఖ్య పైన ఇంకా అధికారులు ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. పోలీసులు, స్థానికులు బస్సు లో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. భద్రాచలంలోని ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళుతున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అందులో గాయపడిన ప్రయాణికులు తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి. అయితే మరణించిన వారికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదట. గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మాత్రం అధికారులు తెలియజేస్తున్నారు. మరి కొన్ని గంటలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: