అఖండ 2: మూవీ రివ్యూ.. బాలయ్య విశ్వరూపమే..!
స్టోరీ విషయానికి వస్తే:
బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) రాయలసీమలోనే ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన కూతురే జనని (హర్షాలి మల్హోత్రా) చిన్న వయసులోనే తన అద్భుతమైన టాలెంట్ తో సైంటిస్టుగా పేరు సంపాదిస్తుంది. మరొకవైపు భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలంటూ చైనా ఎదురుచూస్తుంది. అందుకోసం మన దేశంలో ఉండే రాజకీయ నాయకుడు ఠాకూర్ (కబీర్ సింగ్) సహాయం తీసుకుంటుంది. అలా వీరందరూ కలిసి భారత దేశ సనాతన ధర్మమూలాలను నాశనం చేయాలని చూస్తుంటారు. ఆ సమయంలోనే అఖండ (బాలకృష్ణ) వచ్చి ఏం చేశారు? ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా స్టోరీ.
స్క్రీన్ ప్లే:
సరైన సమయంలో ట్రెండ్ పట్టుకుని సనాతన హైందవ ధర్మం గురించి డైరెక్టర్ బోయపాటి చూపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని బాలయ్య తప్ప మరెవరు చేయలేరు అన్నట్టుగా నటించారు. సినిమాలోని డైలాగులు కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొత్తం దేవుడు చుట్టూనే తిరుగుతుంది. గత సినిమాలలోగా ఇంటర్వెల్ వరకు సినిమాని నడిపించి ఇంటర్వెల్ ముందు పెద్ద బాలయ్యను ఎంట్రీ ఇచ్చేలా చేశారు బోయపాటి. ఆయన రావడంతోనే సినిమా మరో మలుపు తిరుగుతుంది. థమన్ అందించిన మ్యూజిక్ కూడా థియేటర్లలో స్పీకర్లకు పట్టిన తుప్పు మొత్తం వదిలిపోయేల కనిపిస్తోంది. చూడడానికి రొటీన్ కథ అయినప్పటికీ సనాతన హైందవ ధర్మం గురించి చెప్పిన సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయి. ఆది పినిశెట్టితో వచ్చే సన్నివేశాలు పర్వాలేదు, అయితే సెకండ్ హాఫ్ లో ఎవరు ఊహించని ఒక కామియో ఉంటుంది. ఆ సీను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్లో బాలయ్య రుద్రతాండవం చూపించారు.
నటీనటులు:
బాలయ్య మరొకసారి తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు. సంయుక్త మీనన్ కు చిన్న క్యారెక్టర్ , కీలకమైన పాత్రలో హర్షాలి మల్హోత్రా అద్భుతంగా నటించింది. ఆదిపినిశెట్టి విలనిజం పండలేదు.అయితే ఇందులో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి.
రేటింగ్: 2.8/5