పాకిస్తాన్ తో మ్యాచ్.. వసీం జాఫర్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు ఇదే?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నది భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించి. ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. దాయాదుల సమరం ని చూసేందుకు ప్రస్తుతం అందరూ సిద్ధమైపోయారు. హై ఓల్టేజీ మ్యాచ్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయడానికి ఇక సమయం కుదుర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. రేపు యూఏఈ వేదికగా  రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇక ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ తరఫున ఎవరు తుది జట్టులో ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై పంపించిన భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందించాడు. పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో భారత జట్టు ఆటగాళ్లు ఎవరు ఉంటే బాగుంటుంది అన్న విషయం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈక్రమంలోనే వసీం జాఫర్ ఇక తన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు అని చెప్పాలి.


 మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో వివరాలు చూసుకుంటే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్  టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లుగా సెలెక్ట్ చేసారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ రవి బిష్ణయ్,  చాహల్ లాంటి ఆటగాళ్లకు కూడా తన జట్టులో చోటు కల్పించాడు వసీం జాఫర్. ఇక ఇలాంటి ఆటగాళ్లతో టీమిండియా పాకిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగింది అంటే ఇక తిరుగు ఉండదు అంటూ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: