పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ.. గాయంతో అతను కూడా దూరం?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రేపు జరగ బోతుంది . ఇక ఈ మ్యాచును వీక్షించేందుకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమై పోయారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయం లోనే ఇరు జట్లు కూడా తప్పకుండా విజయం సాధించాలనే లక్ష్యం తో ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాయి. కాగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదల తో ఉన్న ఇరు జట్లకు కూడా గత కొంత కాలం నుంచి గాయాల బెడద వేధిస్తూనే ఉంది అని చెప్పాలి.

 ఇప్పటికే భారత జట్టు లో జస్ప్రిత్ బూమ్రా హర్షల్ పటేల్ లాంటి కీలకమైన బౌలర్లు దూరమయ్యారు. ఈ క్రమం లోనే సీనియర్లు లేకుండా అటు యువ ఆటగాళ్లు తమ బౌలింగ్ తో ఎలా రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారి పోయింది. అదే సమయం లో పాకిస్థాన్ జట్టులో కూడా ఇలా గాయాల బెడద కలవరపెడుతుంది.  ఇప్పటికే పాకిస్థాన్ జట్టులో కీలక బౌలర్ గా వ్యవహరిస్తున్న షాహీన్ అఫ్రిది గాయం కారణం గా దూరం అయ్యాడు అని చెప్పాలి.

 పాకిస్తాన్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించి తన బౌలింగ్తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టె షాహీన్ అఫ్రిది దూరం కావడం తో పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ఈ క్రమం లోనే షాహీన్ అఫ్రిది లేకుండానే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంది పాకిస్థాన్ జట్టు. ఇలాంటి సమయం లో మరో ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే షాహీన్ అఫ్రిది దూరం కాగా ఇప్పుడు మరో పేసర్ మహ్మద్ వసీం వెన్ను నొప్పితో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.  అతని స్థానం లో హసన్ అలీ పాకిస్తాన్ జట్టు టీం లోకి తీసుకుంది. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రేపు రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: