పాక్ క్రికెటర్ పై పూజారా ప్రశంసలు.. ఏమన్నాడంటే?

praveen
సాధారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే విధంగా వైరం కొనసాగుతూ ఉంది. కేవలం  దేశ సరిహద్దుల మధ్య మాత్రమే కాకుండా అటు క్రీడలలో కూడా ఈ వైరం కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భారత్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అన్నట్లుగానే భావిస్తూ ఉంటారు ప్రేక్షకుల. ప్రేక్షకులందరూ ఇలా ఉన్నప్పటికీ అటు మైదానంలోకి దిగి క్రికెట్ ఆడే ప్లేయర్స్ మాత్రం స్నేహితుల్లాగే కలిసి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎన్నో సార్లు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరు ఎక్కడ కలిసిన కూడా ఎంతో ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించు కుంటూ ఉంటారు. అయితే ఇటీవల చటేశ్వర్ పుజారా సైతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్  కప్ లో భాగంగా అటు పాకిస్థాన్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్ తో కలిసి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మహమ్మద్ రిజ్వాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు పూజారా. రిజ్వాన్ ఒక టాలెంటెడ్ ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు అని చెప్పాలి.

 అయితే మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగనుంది. ఇలాంటి సమయంలో ఎంత మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఇరు జట్ల బలాబలాల పై చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పూజారా పాకిస్థాన్ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే సోషల్ మీడియాలో 30 నిమిషాల పాటు అభిమానులతో ముచ్చటించాడు పూజారా. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అభిమాని రిజ్వాన్  గురించి అడగ్గా.. అతనితో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. మంచి వ్యక్తి.. అలాగే టాలెంటెడ్ క్రికెటర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.  వీరిద్దరూ ప్రస్తుతం కౌంటీ క్రికెట్ లో ససెక్స్ జట్టు తరఫున ఆడుతున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: