ఆసియా కప్ ముందు.. కోహ్లీ కీలక నిర్ణయం?
కానీ విరాట్ కోహ్లీ మాత్రం మునుపటి ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. ఒకప్పుడు భారీగా పరుగులు చేసి అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో తన రాకింగ్ క్రమ క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. అయితే మరికొన్ని రోజులలో జరగబోయే ఆసియా కప్లో భాగంగా రాణిస్తాడు అన్న ఆశ ప్రతి అభిమాని లో ఉంది. అయితే ఆసియా కప్ కి ముందు విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది. సాధారణంగా విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్ జీనియస్ బ్యాట్ వాడుతూ ఉంటాడు.
ఇప్పుడు మాత్రం ఆ బ్రాండ్ కి స్వస్తి పలికాడు. ఇకపై నుంచి విరాట్ కోహ్లీ ఎమ్ఆర్ఎఫ్ గోల్డ్ విజర్డ్ బ్యాట్ తో బరిలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి కెరియర్లోనే ఎప్పుడూ లేనట్లుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ ఈ కొత్త బ్యాట్ తో అయినా మళ్లీ కొత్తగా ఆట ప్రారంభిస్తాడు అని అభిమానులు నమ్ముతున్నారు. అయితే కోహ్లీ సెంచరీ చేసి మూడేళ్లు దాటిన నేపథ్యంలో ఆసియా కప్లో భాగంగా సెంచరీ రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. కోహ్లీ ఆడబోయే ఎంఆర్ఎఫ్ గోల్డ్ విజర్డ్ బ్యాట్ బరువు 1.15 కిలో గ్రాములు ఉంటుంది అని తెలుస్తుంది