కోహ్లీ కెప్టెన్సీ లోనే.. అలా జరిగింది : గ్రేమ్ స్మిత్

praveen
గత కొంత కాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ క్రికెట్ కు ఉన్న ఆదరణ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలికాలంలో టీ20 ఫార్మట్ కు ఊహించని రీతిలో పాపులారిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఆటగాళ్లు సైతం ఇక కోట్లు కురిపించే.. పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి  పెట్టే టీ20 ఫార్మాట్ ని ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టి20 ఫార్మాట్ ఆడేందుకు ఏదైనా ఫార్మాట్ అడ్డుగా ఉంది అని భావిస్తే రిటైర్మెంట్ ప్రకటించడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు అని చెప్పాలి.

 ఇలా టెస్ట్ ఫార్మాట్కు రోజురోజుకీ ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో టీ20 ఫార్మాట్ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని సుదీర్ఘమైన ఫార్మాట్ను కాపాడాల్సిన బాధ్యత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద ఉంది అంటూ కొంతమంది మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఉన్నంతకాలం టెస్టు ఫార్మాట్ కి ఎలాంటి అంతరాయం ఉండదు అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



 ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన  సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టెస్టు ఆడే దేశాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది అంటూ వ్యాఖ్యానించాడు. రానున్న రోజుల్లో కేవలం కొన్ని దేశాలు మాత్రమే టెస్ట్ ఫార్మాట్ ఆడే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. అదేసమయంలో దక్షిణాఫ్రికా లీగ్ గురించి మాట్లాడుతూ ఐపిఎల్ ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా లీగ్లో భాగంగా జట్లను కొనుగోలు చేయడం తమ దేశ క్రికెట్ కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లి సారథ్యంలో టెస్ట్ క్రికెట్ మరో స్థాయికి ఎదిగింది. అతని హయాంలోని ఆటగాళ్లు ఈ ఫార్ముట్ ను సీరియస్గా తీసుకున్నారంటూ అభిప్రాయపడ్డాడు గ్రేమ్ స్మిత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: