ఇప్పటికైనా మారండి.. ఇంగ్లాండ్ జట్టుపై మాజీ కెప్టెన్ సీరియస్?
అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘోర ఓటమి చవిచూసిన నేపధ్యంలో ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ కు సరైన ప్రాక్టీస్ చేయకుండానే ఎలా బరిలోకి దిగుతారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అలెస్టర్ కుక్. అయితే మొదటి టెస్ట్ ఆరంభానికి ముందు సౌతాఫ్రికా జట్టు బలమైన ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.ఈ మ్యాచ్ ద్వారా అటు సౌత్ ఆఫ్రికాకు మంచి ప్రాక్టీస్ లభించింది అని చెప్పాలి. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లాండ్ లయన్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఒక ఇన్నింగ్స్ 51 పరుగులతో తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.
ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఓటమి కారణంగానే తాము చేసిన తప్పులను సౌత్ ఆఫ్రికా తెలుసుకోగలిగింది. ఆ తప్పులు పునరావృతం కాకుండా తొలి టెస్ట్ మ్యాచ్లో సిద్ధం అయ్యింది. అటు ఇంగ్లాండ్ మాత్రం ఇలాంటి ప్రాక్టీస్ మాట్లాడకుండానే బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలోనే ఓ క్రీడా చానల్ తో మాట్లాడిన అలెస్టర్ కుక్ రెడ్ బాల్ క్రికెట్ లో టచ్ లో ఉండాలి అంటే దానికి తగిన ప్రాక్టీస్ ఉండాలని చెప్పుకొచ్చాడు. ప్లేయర్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని తెలిపాడు. సాధారణంగా టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ కు మొదటి మ్యాచ్ అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. సొంత గడ్డపై కాబట్టి కాస్త ఎక్కువగానే ఎడ్జ్ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఇలా జరగలేదు. మా జట్టు ఆటతీరును వేరే రకంగా మార్చుతాం అనే మాటలు మాట్లాడుతుంది. సరైన ప్రాక్టీస్ ఉన్నప్పుడు కదా క్రికెట్ మ్యాచ్ ఆడాలి. ఆ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు మర్చిపోతుంది అంటూ వ్యాఖ్యానించాడు.