మరో ఓపెనర్ ఎవరు.. టీమిండియాలో కొత్త సమస్య?
అంతేకాదండోయ్ గత కొంతకాలంగా టీమిండియా సెలెక్టర్లు తరచూ జట్టులో మార్పులు చేస్తూ ప్రయోగాలు చేయడం కూడా మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతం రోహిత్ శర్మ తో పాటు మరో ఓపెనర్ ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు ఓపెనింగ్ స్థానం కోసం టీమిండియా లో తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ రెగ్యులర్ ఓపెనర్గా ఉండగా మరో ఓపెనర్ స్థానం కోసం శిఖర్ ధావన్, గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ పోటీ పడుతున్నారు. ఇక టీ20 ల నుండి దావన్ ను దాదాపు పక్కన పెట్టినట్లు అని తెలుస్తోంది.
ఇక కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ ఇలాంటి కీలకమైన టోర్నీలో రోహిత్కు జోడీగా కె.ఎల్.రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం శుభమాన్ గిల్ ఓపెనర్గా అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. గత నాలుగు వన్డే మ్యాచులు చూసుకుంటే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కు అయితే గత కొన్ని రోజుల నుంచి సరైన అవకాశాలు కూడా రావడం లేదు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఓపెనింగ్ సమస్య కాస్త అటు ఆటగాళ్లకు ఇటు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అన్నది ప్రస్తుతం అర్థమవుతోంది.