అతనికంటే తోపు బౌలర్లు.. టీం ఇండియా లో ఉన్నారు : పాంటింగ్

praveen
టీమిండియాలో సీనియర్ బౌలర్ గా పేరున్న మహమ్మద్ షమీ  గత కొంత కాలం నుంచి పొట్టి ఫార్మట్ కు పూర్తిగా దూరమైపోయాడు అనే విషయం తెలిసిందే. గత ఏడాది టీ20 ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కించుకున్న షమి ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క సారి కూడా భారత జట్టు తరఫున టి20 మ్యాచ్ ఆడలేదు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో మహ్మద్ షమీ కి చోటు దక్కుతుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

 అయితే ఇటీవల సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమికి ఆసియా కప్లో చోటు దక్కలేదు అన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే అటు వరల్డ్ కప్ జట్టు ఎంపికలో కూడా అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అనేది తెలుస్తుంది. ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మహమ్మద్ షమీ సుదీర్ఘ ఫార్మాట్ కు సూట్ అయ్యే బౌలర్  అంటూ చెప్పుకొచ్చాడు. టి20 క్రికెట్ లో అతని కంటే మెరుగైన బౌలర్ లు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించాడు.

 ఇటీవలే ఐసీసీ రివ్యూ ఎపిసోడ్ లో భాగంగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ మహమ్మద్ షమీ కంటే మెరుగైన బౌలర్లు భారత్ లో ఉన్నారు అంటూ వ్యాఖ్యానించాడు. షమి సుదీర్ఘకాలంగా టీమిండియాకు ఆడుతున్న బౌలర్ అయితే అతని బలం టెస్ట్ క్రికెట్ కి సెట్ అవుతుంది. కానీ పొట్టి ఫార్మాట్లోనూ అతను మెరుగ్గా రాణించి లేడు. అతని కంటే మెరుగైన బౌలర్లు  టి20 క్రికెట్ లో ఉన్నారు  కాబట్టే వారిని ఆసియాకప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే అటు వరల్డ్ కప్ లో కూడా ఎంపిక చేస్తారని భావిస్తున్నా.. ఆసియా కప్ లో భారత్ గెలుస్తుందని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: