ఉమెన్స్ ఐపీఎల్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

praveen
ప్రస్తుతం భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ లోకి టీ20 ఫార్మాట్ అరంగేట్రం చేసిన కొన్ని రోజుల వ్యవధి లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది బిసిసీఐ. అయితే ఈ దేశీయ లీగ్ కి ఊహించని రీతిలో అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. భారత్ లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు.. అటు విదేశీ ఆటగాళ్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి.
 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఇప్పుడు వరకు ఎంతో మంది ఆటగాళ్లు ఒకవైపు ఆదాయం తో పాటు మరోవైపు చేతులు కూడా సంపాదించుకున్నారు. ఇంకా ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక మంచి వేదికగా మారి పోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన ప్రసార హక్కుల వేలం కారణం గా ఐపీఎల్ రేంజ్ ఒక్కసారిగా మారి పోయింది. ఈ క్రమం లోనే పురుషుల ఐపీఎల్ మాదిరి గానే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది.

 గత కొన్ని రోజుల నుంచి దీనిపై కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది మార్చిలో నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. అయితే బిసిసిఐ దీని కోసం ప్రత్యేకమైన విండో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మహిళల మ్యాచ్ షెడ్యూలు మార్చింది. సాధారణంగా   నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు షెడ్యూల్ ఉంటుంది. కానీ ఈసారి అక్టోబర్ 11 నుంచి ప్రారంభమై ఫిబ్రవరిలో ముగియనుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు సౌతాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: