అతను అంత పనికిరాని వాడా.. బీసీసీఐ ఎందుకిలా చేస్తుంది?

praveen
మరికొన్ని రోజుల్లో ఆసియాకప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక ఇటీవలే భారత జట్టు ఆసియా కప్ ఆడబోయే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే బిసిసిఐ ప్రకటించిన జట్టు కాస్త ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ పై ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి. క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా కాకుండా సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ  జట్టులో సభ్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇలా చేయడంపై క్రికెట్ అభిమానులు అందరూ కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

 ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ నిర్వాకంపై దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా సంజూ శాంసన్ ను ఎంపిక చేయకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా బాగా రాణిస్తున్న సంజు శాంసన్ ను ఎందుకిలా ఆసియా కప్ కు ఎంపిక చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అతను మరీ అంత పనికిరాని ఆటగాడా.. బాగా ఆడుతున్న ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు.. ఎందుకు అతని అణచివేయాలని  చూస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

 దినేష్ కార్తీక్ ని ఎంపిక చేసిన వారు సంజు శాంసన్ ఎంపిక చేయకపోవడం లో ఆంతర్యం ఏమిటి అంటూ అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో టి20 జట్టులో అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దీంతో అతను ఆసియా కప్ ఆడబోయే జట్టులో ఉండటం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ బీసీసీఐ మాత్రం అతని పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా సంజు శాంసన్ కు చోటు దక్కుతుందా లేదా అన్నది ప్రస్తుతం అనుమానం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: