రోహిత్ కు పక్కలో బల్లెంలా హార్దిక్.. తర్వాత కెప్టెన్ అతనే?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు.. ఈ క్రమంలోనే భారత జట్టు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ విజేతగా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం జట్టులో ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి టీమిండియాకు వరుసగా కెప్టెన్ లను మార్చడమే కాదు జట్టులో ఆటగాళ్లను కూడా తరచూ మార్పులు చేస్తూనే వస్తుంది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే ఇక వరుసగా విదేశీ పర్యటనకు వెళుతున్న భారత జట్టు అక్కడ సత్తా చాటుతోంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా వరుస షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతున్న టీమిండియాను గాయాల బెడద కూడా వేధిస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుకొని సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కె.ఎల్.రాహుల్ అందరూ ఏదో ఒక కారణంతో జట్టుకు దూరం అవుతూనే ఉన్నారు. అయితే వెస్టిండీస్తో జరిగిన మూడో టి-20లో నడుం పట్టడంతో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఒకవేళ టీ20 ప్రపంచ కప్ కి ముందు రోహిత్ శర్మ గాయపడితే ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎంతో తెలివిగా ఆలోచించే కోచ్ రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ కు ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం గా చేసి ఉంచినట్లు తెలుస్తోంది..

 రోహిత్ శర్మ ప్రత్యామ్నాయం ఎవరో కాదు హార్థిక్ పాండ్య అన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కెప్టెన్సీలో అదరగొట్టి గుజరాత్ టైటాన్స్ కు మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడు హార్దిక్ పాండ్యా. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. ఇక అనుకోని పరిస్థితుల్లో రోహిత్ శర్మ టీమిండియాకు దూరమైతే అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ని కాకుండా హార్దిక్ పాండ్యా కు పొట్టి ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నాడు కంటూ ఒక టాక్ వినిపిస్తోంది.  ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: