ఓరి నాయనో.. కరోనా వచ్చినా.. మ్యాచ్ ఆడించారు?

praveen
ఇటీవలి కాలంలో ఎన్నో కఠిన నిబంధనల మధ్య అన్ని రకాల క్రీడలను నిర్వహిస్తూ ఉన్నప్పటికీ అటు కరోనా వైరస్ మాత్రం క్రీడాకారులపై పగబట్టినట్లు గానే వ్యవహరిస్తూ ఉంది అనే విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పంజా  విసురుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్ళు కీలకమైన మ్యాచ్ లకు దూరం అవుతూ ఇక నిరాశలో మునిగిపోతున్నారు. అటు క్రికెట్ ఆటగాళ్లపై కూడా ఇదే రీతిలో పంజా విసురుతుంది కరోనా వైరస్ అయితే ఎవరైనా ఆటగాడు కరోనా వైరస్ బారిన పడ్డాడు అంటే చాలు ఒక్కసారిగా నిర్వాహకులు అందరూ అప్రమత్తమై పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరోనా వైరస్ మిగతా ఆటగాళ్లు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి ఇక వైరస్ బారిన పడిన ఆటగాళ్లను మిగతా ఆటగాళ్లతో వేరుగా ఉంచడం లాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా వారు జట్టుతో కలిసేందుకు అసలు వీలు ఉండదు. వైరస్ బారిన పడిన ఆటగాళ్లను  ఐసోలేషన్ లో పెట్టి అందరికీ దూరంగా చికిత్స అందించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. కరోనా వైరస్ వచ్చింది అని అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ క్రీడాకారిణిని మాత్రం ఎప్పటిలాగానే మ్యాచ్ ఆడించడం కాస్త సంచలనంగా మారిపోయింది.

 ఇది సాదా సీదా ద్వైపాక్షిక సిరీస్ లో జరగలేదు ఏకంగా విశ్వ వేదిక అయినా కామన్వెల్త్ గేమ్స్ లో జరగడం గమనార్హం. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో భాగంగా కరోనా వైరస్ కలకలం రేపింది. ఆస్ట్రేలియా క్రికెటర్ తహేళ మెక్ గ్రాత్  కి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది.. అయినప్పటికీ ఆమెను 11 మంది తో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో ఆమెను కామన్వెల్త్ కమిటీ కూడా ఆడేందుకు అవకాశం కల్పించింది. ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్ కు దిగిన సదరు బ్యాటర్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక మొత్తంగా మ్యాచ్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పైచేయి సాధించి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: