నేడే సెమీ ఫైనల్.. భారత ప్రత్యర్థి ఎవరో తెలుసా?

praveen
దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కి అవకాశం దొరికింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కామన్వెల్త్ క్రీడల్లో వచ్చిన అవకాశాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు మహిళా క్రికెటర్లూ. కాగా ఎట్టి పరిస్థితుల్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా జరుగుతున్న టీ-20 టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.  అయితే గ్రూప్-ఎ గ్రూప్-బి లో టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రూప్ ఏ లో నుంచి ఆస్ట్రేలియా భారత్ జట్లు అద్భుతమైన ప్రదర్శన చేసి సెమీఫైనల్లో అడుగు పెట్టాయి.

 ఇక గ్రూప్ బి నుంచి ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్లు సెమిస్ చేరాయి. ఈ క్రమంలోనే సెమీ ఫైనల్ పోరులో భాగంగా ఏ జట్టు ఎవరి తో పోటీ పడబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో మ్యాచ్ ఆడబోతుంది అన్నది తెలుస్తుంది. ఇంకోవైపు గ్రూప్ ఏ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడబోతుంది.

 ఈ క్రమంలోనే నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది అనే చెప్పాలి. ఇక ఈ సెమీ ఫైనల్లో విజయం సాధించిన వారు ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో తలపడతారు. ఈ క్రమంలోనే ఇక ఫైనల్ పోరులో గెలిచిన జట్టుకు స్వర్ణం దక్కించుకుంటుంది. ఓడిపోయిన జట్టు రజతం సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే సెమీఫైనల్లో ఓడిపోయిన జట్ల మధ్య కూడా మరోసారి మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇలా ఓడిన జట్లకు జరిగిన మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కాంస్య పతకం దక్కుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: