సెంచరీ మిస్సైనా.. దిగ్గజాల సరసన గిల్?
ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో ఇలా ఎన్నో సార్లు జరిగింది అన్న విషయం తెలిసిందే. 90 కి పైగా పరుగులు చేసి సెంచరీ సాధిస్తాడు అనుకున్న ఆటగాడు చివరి నిమిషాల్లో వికెట్ కోల్పోతూ ఉంటాడు. ఇక ఇటీవలే టీమ్ ఇండియా వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగుల వద్ద సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక మూడో వన్డే మ్యాచ్లో జట్టు యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ 98 పరుగులు వద్ద సెంచరీ మిస్ చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే.
సెంచరీ మిస్ చేసుకోవడంపై ఎంతగానో నిరాశలో మునిగిపోయాడు శుబ్ మన్ గిల్. అయితే సెంచరీ మిస్ అయినప్పటికీ అటు దిగ్గజాల సరసన మాత్రం నిలిచాడు ఈ యువ ఓపెనర్. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి లెజెండరీ క్రికెటర్స్ సరసన చోటు సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. టీమ్ ఇండియా తరఫున వన్డే ఫార్మాట్లో 90కి పైగా పరుగులతో నాటౌట్గా నిలిచిన జాబితాలో శుబ్ మన్ గిల్ చేరిపోయాడు. కాగా ఇప్పటి వరకూక్రిష్ణమచారి శ్రీకాంత్(93*),సునీల్ గావస్కర్(92*),సచిన్ టెండూల్కర్ (96*), వీరేంద్ర సెహ్వాగ్ (99*), శిఖర్ ధావన్ (97*), శుబ్‌మన్ గిల్(98*) టీమ్ ఇండియా తరఫున వన్డేలలో 90 కి పైగా పరుగులు చేసిన లిస్టులో ఉన్నారు.