వార్నీ.. మైదానంలో ఇలా కూడా గొడవ పడతారా?

praveen
సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఉండే ఆటగాళ్లు ఎంత అగ్రెసివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థులతో మాటల యుద్ధానికి దిగడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో ఎన్నో సార్లు చూశాము. అయితే మైదానంలో ఎంత మాటల యుద్ధం చేసుకున్నప్పటికీ  మైదానం వెలుపల మాత్రం మళ్లీ స్నేహితులతో కలిసి పోవడం జరుగుతుంటుంది. ఇక ఇలా మైదానంలో జరిగిన మాటల యుద్ధం అటు ప్రేక్షకుల దృష్టిని కూడా బాగా ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇలా ఎప్పుడైనా జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. శ్రీలంక క్రికెటర్ నిరోషాన్ డిక్వెల్లా పాకిస్థాన్ క్రికెటర్ పవాద్ ఆలం మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే అందరి మధ్య జరిగినట్లుగా  సీరియస్గా కాదు.. సరదాగా ఇద్దరూ మాటల యుద్ధం చేసుకున్నారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే నిరోషాన్ డిక్వెల్లా పవాద్ ను ఉద్దేశించి ఏదో అన్నాడు. పవాద్ కూడా కౌంటర్ ఇచ్చాడు.


 ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే పాకిస్తాన్ బౌలర్ హరీష్ రౌఫ్.. వారి మధ్య ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండిపోయారు. అయితే వీరిద్దరి మధ్య జరుగుతుంది సీరియస్ గొడవ కాదని ఫన్నీగా జరుగుతున్న సంభాషణ అని తెలుసుకుని ఈ ఫన్నీ గొడవలో వారిద్దరు కూడా జాయిన్ అయ్యారు అని చెప్పాలి.  ఇందుకు సంబంధించిన వీడియోని  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్ గా మారిపోయింది. కాగా రెండో టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ శ్రీలంక మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: