ఆస్ట్రేలియా పక్కా ప్లాన్.. భారత్ తో మ్యాచ్ కి స్పెషల్ ట్రైనింగ్?
ఎందుకంటే ఒకవైపు ఆస్ట్రేలియాకి మరోవైపు టీం ఇండియా కి కూడా టెస్ట్ లలో మంచి రికార్డు ఉంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఈ రెండు జట్ల మధ్య 102 టెస్ట్ మ్యాచ్ లు జరగగా, 43 టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టీమిండియా 30 టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం గమనార్హం. అంతేకాదు 28 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా పై భారత జట్టు సొంత గడ్డపై ఆడిన సమయంలో ఘనమైన రికార్డును కలిగి ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు భారత్ వేదికగా 21 టెస్ట్ లలో ఆస్ట్రేలియా పై విజయం సాధించింది భారత్. 13 టెస్ట్లో మాత్రమే ఆస్ట్రేలియా విజయం సాధించింది.
అయితే భారత గడ్డపై భారత జట్టును ఓడించడానికి ఆస్ట్రేలియాకు పెద్ద సవాల్తో కూడుకున్నది. ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా రెండో టెస్టులో చిత్తుగా ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఇప్పుడు భారత్ లో కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం ఎనిమిది నెలల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టింది ఆస్ట్రేలియా యాజమాన్యం. భారత్ స్పిన్ పిచ్ లపై ఎలా ఆడాలో నేర్చుకునేందుకు ఎనిమిది మంది ఆటగాళ్లను ఇండియాకు పంపించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. చెన్నై లోని ఎం ఆర్ ఎఫ్ అకాడమీలో శిక్షణ తీసుకోబోతున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.