సిరీస్ గెలిచినా.. టీమిండియాకు షాక్ ఇచ్చిన ఐసీసీ?

praveen
ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో టీమిండియా సాధించిన అద్భుత విజయం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు . నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన రెండు మ్యాచ్లలో కూడా టీమిండియా విజయఢంకా మోగించింది. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అనే చెప్పాలి. అయితే మొదటి వన్డే మ్యాచ్లో కేవలం మూడు పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక రెండో వన్డే మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో చివరికి విజయతీరాలకు చేరి సిరీస్ కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్ లలో కూడా తృటి లో ఓటమి నుంచి తప్పుకుంది అని చెప్పాలి.


 ఇక వెస్టిండీస్పై రెండో మ్యాచ్ లలో విజయం సాధించడం ద్వారా సిరిస్ గెలుచుకొంది. తద్వారా ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి ఒక జట్టు పై వరుసగా 12 వన్డే సిరీస్ లు గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ మొదటి మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది అన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసిన కారణంగా దావన్ సేనకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐ సి సి.



 ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్  క్రికెట్ కౌన్సిల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఐసీసీ ప్రవర్తన నియమావళి లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ కోట పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం బౌలింగ్ కోట పూర్తి చేసేందుకు టీమిండియా సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది తద్వారా మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. కాగా జులై 27 వ తేదీన ట్రినిడాడ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: