నా పెళ్లప్పుడు కూడా ఇంత ఒత్తిడి లేదు : చాహల్
రెండో వన్డే వన్డే మ్యాచ్లో భాగంగా ఏకంగా 312 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఈ క్రమంలోనే లక్ష్యఛేదనలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 49.4 ఓవర్లలో ఇండియా టార్గెట్ ఛేదించింది అనే చెప్పాలి. ఇక జట్టులోని ప్రధాన బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేరిన సమయంలో అక్షర్ పటేల్ 64 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యాను అన్న విషయాన్ని ఇటీవల స్పిన్నర్ చాహల్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ చూస్తున్నంతసేపు తాను గోళ్ళు నములుతూ ఉన్నాను అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో డగౌట్ లో కూర్చోవడం చాలా ఒత్తిడితో కూడుకున్నది అంటూ తెలిపాడు. ఇక తన పెళ్లప్పుడు కూడా ఇలాంటి ఒత్తిడి అనుభవించలేదు అంటూ సరదాగా కామెంట్ చేశాడు చాహల్. ఇక చాహల్ చేసిన కామెంట్ కి అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్ నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇక అదే సమయంలో అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్ కూడా ఇక మ్యాచ్ గురించి మాట్లాడారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.