భారత్ మ్యాచ్ గెలిస్తే.. ఆ విండిస్ బ్యాట్స్మెన్ ప్రేక్షకుల మనసు గెలిచాడు?
అయితే ఉత్కంఠభరితంగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ అటు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మాత్రం అందరి హృదయాలను గెలుచుకున్నాడు. రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ షైహోప్ సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇండియా తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అతని కెరీర్లో వందో వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఇక వందో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.
100 వన్డే మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన పదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన 4 వ వెస్టిండీస్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ అతని వీరోచితమైన సెంచరీ మాత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కాగా వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయినా వెస్టిండీస్ జట్టు మూడో మ్యాచ్లో అయినా విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మూడో వన్డే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారని కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టీమిండియా క్లీన్స్వీప్ పై కన్నేసింది.