నేడే రెండో వన్డే మ్యాచ్.. సిరీస్ పై కన్నేసిన టీం ఇండియా?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు అక్కడ మొదట వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో భాగంగా ఇటీవల వెస్టిండీస్, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఇక మొదటి వన్డే మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా జరిగింది అని చెప్పాలి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో అన్నదానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి మూడు పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు విజయం సాధించింది.

 ఈ క్రమంలోనే మూడు వన్డేల సిరీస్లో భాగంగా 1-0 తేడాతో భారత జట్టు ఆధిక్యాన్ని సంపాదించింది అన్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్ పర్యటనలో మాదిరిగానే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే దానిపై కన్నేసింది టీమిండియా. ఈ ఈ క్రమంలోనే నేడు రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా కు ధీటుగా పోటీ ఇచ్చిన వెస్టిండీస్ రెండో వన్డే మ్యాచ్ లో ఎలా రాణించ బోతుంది  అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు వెస్టిండీస్ మరోసారి విజృంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా  రెండో వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ టీమ్ ఇండియా జట్లు తలపడుతున్నాయి. అయితే భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనబడుతూ   ఉంటే అటు వెస్టిండీస్ జట్టు బౌలింగ్ లో మాత్రం తేలిపోతుంది. కానీ బ్యాటింగ్లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు జరగబోయే రెండో వన్డే మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.  ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: