బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. నేను మాత్రం అలా చేయనంటున్న బెయిర్ స్టో?
సహజంగానే ప్రతి ఆటగాడికి కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతు ఉంటాయి. అయితే నేను మాత్రం వీలైనంత ఎక్కువ కాలం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ప్రయత్నిస్తాను అని మాత్రం చెప్పగలను. కొన్ని సార్లు వివిధ కారణాల వల్ల కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది.నా వరకైతే సమీప భవిష్యత్తులో నేను అలాంటి నిర్ణయం తీసుకోబోను అని చెప్పగలను. ఎందుకంటే వీలైనంత కాలం క్రికెట్లో మూడు ఫార్మాట్లలో ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంటూ బెన్ స్టోక్స్ సహచర ఆటగాడు బెయిర్ స్టో చెప్పుకొచ్చాడు. ఒక మూడు ఫార్మాట్ల జట్టులో కూడా భాగం కావడం తనకు ఎంతో ఇష్టమని తద్వారా ఆటలో ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు బెయిర్ స్టో.
ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్పై స్పందిస్తూ బెయిర్ స్టో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి. కాగా గత కొంతకాలం నుంచి బెయిర్ స్టో అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇండియా తో జరిగిన రీషెడ్యూల్ టెస్టు మ్యాచుతో అద్భుతమైన సెంచరీలతో ఆకట్టుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇండియాతో జరిగిన టీ20 వన్డే సిరీస్ లో కూడా భాగం అయిన బెయిర్ స్టో ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. రెండో వన్డే లో వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడగా 29 ఓవర్లకు కుదించారు. మ్యాచ్లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.