సెంచరీ మిస్సయిన.. రికార్డుల మోత మోగించిన గబ్బర్?

praveen
మొన్నటికి మొన్న ఇంగ్లండ్ పర్యటనలో అనుకున్న స్థాయిలో ప్రదర్శించే లేక నిరాశపరిచిన శిఖర్ ధావన్ ఇక వెస్టిండీస్ పర్యటనలో మొదటి వన్డే మ్యాచ్లో అదరగొట్టేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 97 పరుగులు చేశాడు.  సెంచరీ చేస్తాడు అనుకుంటున్న సమయంలో శిఖర్ధావన్ వికెట్ కోల్పోయి అభిమానులందరినీ నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ ఇక ఎన్నో రికార్డులను ధావన్ ఖాతాలో వేసుకున్నాడు అన్నది మాత్రం తెలుస్తోంది. ఒకసారి ఆ రికార్డులను పరిశీలిస్తే..


 వన్డే ఫార్మాట్ క్రికెట్లో వెస్టిండీస్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా  టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నాడు. యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు గబ్బర్. శిఖర్ ధావన్ 15మనిషిలో 445 పరుగులు చేస్తే అంతకుముందు  ధోని 15 మ్యాచ్లలో  458 పరుగులు, కోహ్లీ 15 మార్కులు 790 పరుగులు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్ శిఖర్ ధావన్ కెరీర్లో 150వ మ్యాచ్ కావడం గమనార్హం. ఇలా 150 వన్డేల్లో అత్యధికంగా 50+ చేసిన మూడో బ్యాట్స్మెన్గా నిలిచాడు శిఖర్ధావన్. హషీమ్  ఆమ్ల  57 సార్లు, విరాట్ కోహ్లీ రిచర్డ్స్ సన్  55 సార్లు 50+ పరుగులు చేయగా.. శిఖర్ ధావన్   53 సార్లు 50 ప్లస్ పరుగులు చేశాడు.


 అంతేకాదు వెస్టిండీస్ గడ్డపై ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా  రెండవ స్థానంలో నిలిచాడు.  ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ఏడుసార్లు 50కిపైగా పరుగులతో మొదటి స్థానంలో ఉంటే రోహిత్ శర్మ ఐదుసార్లు ఇక ఇప్పుడు శిఖర్ ధావన్ రోహిత్ సమానంగా కొనసాగుతున్నాడు. అంతేకాదు అతి పెద్ద వయసులో వన్డే లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు 1999లో అజారుద్దీన్ 36 ఏళ్ళ 120 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేస్తే శిఖర్ ధావన్ 36వఏళ్ళ 229 రోజుల వయసులో హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: