పాకిస్థాన్ కి భారీ షాక్.. ఆందోళనలో ఫ్యాన్స్?
ఇక మొదటి టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన జోష్ లోనే ఇక జూలై 24వ తేదీ నుంచి శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతుంది. అయితే ఇక శ్రీలంకతో రెండో టెస్టు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది అని తెలుస్తోంది. మొదటి మ్యాచ్ లో జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన షాహీన్ అఫ్రిది ఇక రెండవ టెస్ట్ కి గాయం కారణంగా దూరమయ్యాడు అన్నది తెలుస్తోంది. మొదటి టెస్టు మ్యాచ్లో మోకాలి గాయంతో ఎంతగానో బాధ పడ్డాడు. ఈ క్రమంలోనే నొప్పితో విలవిలలాడుతూ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో మైదానాన్ని వీదాడు అన్న విషయం తెలిసిందే.
ఇక అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కీలకమైన రెండో టెస్టుకు షాహీన్ అఫ్రిది దూరం అయ్యాడు. దీంతో పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. పాకిస్తాన్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి ఆతిథ్య శ్రీలంక జట్టు ను కేవలం 222 పరుగులకే కట్టడి చేయడంలో షాహీన్ అఫ్రిది కీలక పాత్ర వహించాడు. అతడు గాయం బారిన పడిన నేపథ్యంలో అతని స్థానంలో యువ పేసర్ హరీష్ రవుఫ్ తుది జట్టులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్థాన్ జట్టు అంచనా ప్రకారం :
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, అజర్ అలీ, బాబర్ ఆజం (సి), అఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ,హరీస్ రవూఫ్ , నసీమ్ షా.