గబ్బర్ ముందు అరుదైన రికార్డు.. కోహ్లీ, ధోని, రోహిత్ లను వెనక్కి నెట్టే ఛాన్స్?

frame గబ్బర్ ముందు అరుదైన రికార్డు.. కోహ్లీ, ధోని, రోహిత్ లను వెనక్కి నెట్టే ఛాన్స్?

praveen
భారత జట్టు ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఒక దేశ పర్యటన ముగియగానే ఆలస్యం లేకుండా మరో దేశ పర్యటనకు వెళ్తూ వరుసగా సిరీస్లు ఆడుతూనే ఉంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంగ్లాండ్లో పర్యటనను ఎంతో దిగ్విజయంగా ముగించుకున్న భారత జట్టు ఇక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే వెస్టిండీస్ గడ్డపై అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. అక్కడ ప్రాక్టీస్ లో  మునిగితేలుతోంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా నేడు మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది.


 అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వెస్టిండీస్  పర్యటనలో భాగంగా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే  తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ను ఇక వెస్టిండీస్తో వన్డే కి ముందు పలు ఆసక్తికర రికార్డులు ఊరిస్తున్నాయి అన్నది తెలుస్తుంది. అయితే ముందుగా కెప్టెన్గా శిఖర్ ధావన్ జట్టును ఎలా ముందుకు నడిపించ పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం శిఖర్ ధావన్ కు ఇది రెండో సారి. గతంలో శ్రీలంక లో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు.


 ఈ క్రమంలోనే శిఖర్ధావన్ ముందు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని లకు చెందిన రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వెస్టిండీస్ టూర్లో భాగంగా మూడు వన్డేలు శిఖర్ ధావన్ ఆడితే వెస్టిండీస్ గడ్డపై అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా నిలువ బోతున్నాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లు అత్యధికంగా 15 మ్యాచులు ఆడి అందరికంటే ముందున్నారు. రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లు 14 మ్యాచ్ లతో  తర్వాత స్థానంలో ఉన్నారూ. ఇక ఇప్పుడు శిఖర్ ధావన్ మూడు మ్యాచ్లు ఆడితే విండీస్  గడ్డపై 17 మ్యాచ్ లు పూర్తి చేసుకుంటాడూ. దీంతో కోహ్లీ ధోని రోహిత్ లని వెనక్కి నెట్టేస్తాడు. మరో 110 పరుగులు చేస్తే వెస్టిండీస్ గడ్డపై  ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాట్స్మెన్గా కూడా కోహ్లీ తర్వాత రెండో స్థానంలో  నిలుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: