టీమిండియాలో అతనుంటే.. నాకు భయమే : రికీ పాంటింగ్
అయితే విరాట్ కోహ్లీ వరుసగా వైఫల్యం చెందుతూ ఉండడం పై అటు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తన స్థానాన్ని త్యాగం చేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అంటూ కొంతమంది సూచిస్తూ ఉంటే.. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని మళ్ళీ టీమిండియా లోకి రావాలని మరికొంతమంది సలహా ఇస్తున్నారు. అదే సమయంలో కోహ్లీ మళ్లీ మునుపటి ఫాంలోకి వస్తాడని ఇంకొంత మంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక విరాట్ కోహ్లీ ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
కాగా విరాట్ కోహ్లీ పేలవమైన ఫాంపై ఇటీవలే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ తిరిగి వేగంగా ఫామ్ అందుకోవడం ఎంతో కీలకం అంటూ రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఎంతటి ఆటగాడైన ఫామ్ కోల్పోవడం సర్వసాధారణం అని.. అయితే ప్రస్తుతం కోహ్లీ దగ్గర ఎక్కువ సమయం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడూ రికీ పాంటింగ్. ఒక ప్రత్యర్థి ఆటగాడిగా కోహ్లీ ఉన్న టీమిండియా అంటే తనకు ఎంతో భయమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా వెస్ట్ ఇండీస్ టూర్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.