అలాంటి బ్యాట్స్మెన్ తరానికికొకరు కావాలి : సంజయ్ మంజ్రేకర్
113 బంతుల్లో 125 పరుగులు చేసి ఔరా అనిపించాడు రిషబ్ పంత్. దీంతో ఓడిపోతుంది అనుకున్న టీమిండియా చివరికి విజయం సాధించి అదరగొట్టింది అని చెప్పాలి. అయితే రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ నేపథ్యంలో ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇదే విషయంపై స్పందిస్తూ అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం పంత్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. మూడో వన్డే మ్యాచ్లో రిషబ్ పంత్ ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
రిషబ్ పంత్ ఎప్పుడు బాధ్యతాయుతం గానే ఆడతాడు అని తెలిపాడు. ఇక కొన్ని సార్లు అవుట్ అయిన సందర్భంలో మాత్రం బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. ఎవరైనా సరే దూకుడుగా ఆడేటప్పుడు వికెట్ కోల్పోవడం కామన్. రిషబ్ పంత్ బ్యాటింగ్ వల్ల ఎన్నో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. స్వతహాగా బాధ్యత తీసుకోకపోతే ఎవరు కూడా దూకుడుగా ఆడ లేరు. ఈ విషయంలో పంత్ ఒక అద్భుతమె అని చెప్పొచ్చు. రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు టీమిండియాకు కావాలి. ప్రతి తరంలో ఇలాంటి బ్యాట్స్మెన్లను తయారు చేసుకోవాలి అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.