కోహ్లీని తలపిస్తున్న బాబర్ అజాం.. మరో రికార్డు?

praveen
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారీస్తూ ఉన్నాడు. మొన్నటివరకు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బ్రేక్ చేశాడు. ఇక ఇప్పుడు అదిరిపోయే ఫామ్ లో కొనసాగుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ కోహ్లీ సాధించిన రికార్డులు అన్నింటినీ కూడా వరుసబెట్టి బ్రేక్ చేస్తూ వస్తూ ఉండటం గమనార్హం. ఇలా ఒక వైపు జట్టును తన వ్యూహాలతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే మరోవైపు ఒక బ్యాట్స్మెన్గా జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు బాబర్ అజాం.  సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు   అని చెప్పాలి.


 ఇక ఒకవైపు బాబర్ అజాం సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతు భారీగా పరుగుల వరద పారిస్తున్న నేపథ్యంలో అతన్ని ఎలా అవుట్ చేయాలో తెలియక బౌలర్లు అందరూ కూడా తికమక పడిపోతున్నారు అని చెప్పాలి. ఇలా అందరికీ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ సమయంలో బాబర్  సెంచరీతో అదరగొట్టాడు అనే విషయం తెలుస్తుంది. పాకిస్తాన్ జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్ కాకుండా కాపాడి కేవలం 4 పరుగులు ఆదిత్యం ప్రత్యర్థికి దక్కేలా చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 55 పరుగుల విలువైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్.

 ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన బాబర్ అజాం ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగుల మార్కును అధిగమించాడు.  అయితే 41 ఇన్నింగ్స్ లోనే బాబర్ అజాం ఇది సాధించటం గమనార్హం. తన కెరీర్లోనే పీక్ ఫామ్ లో ఉన్న బాబర్ అజాం ఒకరకంగా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు అని చెప్పాలి. 2015 16 సంవత్సరంలో అటు విరాట్ కోహ్లీ కూడా ఇదే తరహా ఫామ్ కనబరిచి అదరగొట్టేశాడు. ఇక అంతే కాదు పాకిస్థాన్ కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన వారిలో పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తో కలిసి తొలి స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: