కోహ్లీ ఖాతాలో.. అత్యంత చెత్త రికార్డ్?
అన్ని ఫార్మాట్లలో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్లో కూడా అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తూ అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనికి రెస్ట్ ఇవ్వాలి అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో అయినా సరే విరాట్ కోహ్లీ బాగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ నిరాశ తప్పలేదు.
మూడో వన్డే మ్యాచ్లో 17 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాడు. అయితే తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మిగతా రెండు నెలలు కలిపి కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. గత ఐదు వన్డే లో ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగులు కూడా కోహ్లీ చేయలేకపోవడం గమనార్హం. కోహ్లీ వన్డే కెరీర్ లో ఇలాంటి పేలవ ప్రదర్శన కనబరిచడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అదే సమయంలో కోహ్లీ సెంచరీ చేసి కూడా మూడేళ్ళు అవుతుంది. ఇప్పుడు కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రాకపోతే జట్టు నుంచి తప్పించడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది.