జస్ప్రిత్ బూమ్రాని కాపాడుకోవాలి : బ్రాడ్ హాగ్
అంతేకాదు ఇక టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా ప్రస్తుతం జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గత కొంత కాలం నుంచి జస్ప్రిత్ బూమ్రా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే అయినప్పటికీ ఎక్కడ ఫామ్ కోల్పోకుండా తన బౌలింగ్లో మెరుగైన ఫలితాలను రాబడుతున్నాడు. ఇక ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఆడుతున్న టెస్ట్ టీ20 వన్డే ఫార్మాట్ లో కూడా బుమ్రా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జస్ ప్రీత్ బుమ్రా ప్రదర్శన గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా జట్టులో ప్రస్తుతం స్టార్ పేసర్ గా కొనసాగుతున్న బూమ్రా కి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.. ఏ జట్టు కైనా సరే ఫాస్ట్ బౌలర్లు ఆస్తి లాంటి వారు. ఇక స్పిన్నర్ లతో పోల్చి చూస్తే ఫాస్ట్ బౌలర్లపై వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జట్టు యాజమాన్యం ఫాస్ట్ బౌలర్లను కాపాడుకోవడంలో ఎక్కువ దృష్టి పెట్టాలి. టి20 వరల్డ్ కప్ కోసం జస్ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి ఇవ్వడం ఎంతో మంచిది. 2003 వరల్డ్ కప్కు ముందు టెస్ట్ సిరీస్ ఉంటే బ్రెట్లీకి కూడా విశ్రాంతి ఇచ్చారు అంటూ ఈసందర్భంగా బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు. ఇక రానున్న రోజుల్లో జస్ప్రిత్ బూమ్రా కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.