ఒలంపిక్స్ లో తప్పకుండా క్రికెట్ ని చూస్తాం : మహిళా క్రికెటర్

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది . అయితే క్రికెట్ కు పాపులారిటీ పెరిగిపోతుంది. గానీ మొన్నటివరకు కామన్వెల్త్ ఒలంపిక్స్ లాంటి వాటిల్లో క్రికెట్ ఇప్పటివరకు స్థానాన్ని సంపాదించుకోలేదు. కానీ ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రం క్రికెట్ కు అవకాశం దక్కింది అనే విషయం తెలిసిందే. కాగా ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఒలంపిక్స్ లో కూడా క్రికెట్ స్థానం సంపాదించుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా ఇదే విషయంపై స్పందించారు. క్రికెట్ ఒలంపిక్స్ లో చోటు దక్కించుకోవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

 కాగా బర్మింగ్హామ్ వేదికగా జులై 28వ తేదీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా టి20 టోర్నీ కూడా జరగబోతుంది. కాగా ఇటీవలే ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడిన ఆసిస్ మహిళా జట్టు కెప్టెన్.. ఒలింపిక్స్లో క్రికెట్ వుంటే అద్భుతంగా ఉంటుంది. ఆట పరంగా కొత్తగా అభిమానులు వస్తారు. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల అభిమానులు కూడా క్రికెట్ వీక్షించడానికి తరలివస్తారు. అయితే ఒలంపిక్స్ వేదిక కారణంగా క్రికెట్ ఆట వృద్ధి చెందడమే కాకుండా ప్రపంచవ్యాప్తం అవుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు మహిళలందరూ మరింతమంది క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది అంటూ మెగ్ లానింగ్  చెప్పుకొచ్చారు.

 కాగా 2024 లో పారిస్ వేదికగా ఒలంపిక్స్ జరుగుతాయి. ఆ తర్వాత లాస్ ఏంజిల్స్ 2028, బ్రిస్బేన్  2032 ఒలంపిక్స్ ఆతిథ్యం  వహించ ఉన్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఒలంపిక్స్ లాంటి విశ్వ వేదిక లో కూడా క్రికెట్ కి స్థానం దక్కుతుంది అనే నమ్మకం మాత్రం ఉంది అంటూ చెప్పుకొచ్చింది మెక్ లానింగ్. అయితే 20 ఏళ్ల కిందట జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో పురుషుల జట్లు మాత్రమే ఆడాయి. ఇక ఈ గేమ్స్ లో ఆసిస్ సిల్వర్ మెడల్ దక్కించుకుంది. దక్షిణాఫ్రికా గోల్డ్ మెడల్ తో సత్తా చాటింది. 3 స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: