సూర్యకుమార్ యాదవ్.. పేరు గుర్తుపెట్టుకోండి : గంభీర్
అయితే మూడో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ అటు సూర్యకుమార్ యాదవ్ సాధించిన సెంచరీ మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై వీర విహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ 55 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 117 పరుగులు సాధించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ ల దగ్గర నుంచి సహకారం లేకపోవడంతో టీమ్ ఇండియా పరాజయం పాలైంది అని చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ సాధించిన మెరుపు శతకం పై అటు మాజీ ఆటగాళ్లు అందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
360 డిగ్రీస్ లో ఇక మైదానం నలువైపులా కూడా మంచి షాట్లు ఆడుతూ జట్టును గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేశాడు సూర్య కుమార్ యాదవ్. ట్రేడ్ మార్క్ షాట్లతో ఫీల్డర్ లేని ప్రదేశంలో బాల్ ని తరలించడం చేసి పరుగులు రాబట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అమాంతం ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. అయితే సూర్యకుమార్ యాదవ్ ప్రతిభ ను ఎప్పుడు మెచ్చుకునే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఇక ఇటీవల సూర్యకుమార్ యాదవ్ సెంచరీ పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సూర్య కుమార్ యాదవ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అంటూ ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టాడు.