టీమిండియాకు టి20 సిరీస్.. షాహిద్ ఆఫ్రిది ఏమన్నాడో తెలుసా?
ఈ క్రమంలోనే నేడు జరగబోయే మూడో టి20 మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది టీమిండియా. ఇలాంటి సమయంలో టీమిండియా ప్రదర్శనపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అని చెప్పాలి. అయితే ఎప్పుడు టీమిండియా ప్రదర్శనపై అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కూడా ఇటీవల స్పందిస్తూ భారత ప్లేయర్ల ప్రతిభను అభినందించడం విశేషం. అక్టోబర్లో అటు ఆస్ట్రేలియా వేదిక జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ప్రపంచ కప్ గెలిచే అవకాశమున్న జట్లలో టీమిండియా ఒకటి అంటూ అఫ్రిది పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ పై టీమ్ ఇండియా అద్భుతంగా ఆడింది. సిరీస్ను దక్కించుకునేందుకు అన్ని అర్హతలు టీమిండియాకు ఉన్నాయి. టీమ్ ఇండియా బౌలింగ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ ఫేవరెట్స్ లో భారత జట్టు తప్పకుండా ఉంటుంది అంటూ షాహిద్ అఫ్రిది తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఇక షాహిద్ అఫ్రిదీ టీమిండియా పై ప్రశంసలు కురిపించడంతో భారత అభిమానులు కూడా కాస్త పాజిటివ్గానే స్పందిస్తున్నారు అని తెలుస్తోంది. ఇక గత ఏడాది టి20 ప్రపంచకప్లో భాగంగా ఓకే గ్రూపులో ఉన్న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడగా మొదటిసారి టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించింది.