నేడే మూడో టి20.. క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీం ఇండియా?

praveen
మొన్నటికి మొన్న ప్రతిష్టాత్మకమైన టెస్టు మ్యాచ్ లో ఓడి పోయి తీవ్రంగా నిరాశపరిచింది టీమిండియా. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా టి20 సిరీస్ లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది అన్న విషయం తెలిసిందే. సొంతగడ్డపైనే అటు ఇంగ్లాండ్ జట్టును మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది. బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో రాణిస్తూ ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా సూపర్ ప్రదర్శన తో దూసుకు పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో భాగంగా ఏకంగా 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.


 దీంతో ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇక రెండవ టీ 20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు పుంజుకోవడం పక్క అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే అటు భారత జట్టు మాత్రం ఇంగ్లాండుకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. రెండవ టీ 20 మ్యాచ్ లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.  ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను  వరుసగా పెవిలియన్  పంపిస్తూ మ్యాజిక్ చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  అటు రెండో టీ20 లో కూడా ఘన విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది ఇండియా.


 ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఇంగ్లాండ్ గడ్డపైన ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది అని చెప్పాలి. కాగా నేడే మూడో టి20 మ్యాచ్ జరగబోతోంది. ఇది నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ అటు ఇటు జట్లకు కూడా ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ఒకవైపు ఇంగ్లాండ్ జట్టు మూడో మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తూ ఉంటే.. మరోవైపు మూడో మ్యాచ్లో గెలిచి ఇంగ్లాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసి అద్భుతమైన విజయాన్ని సాధించాలని చూస్తుంది టీమిండియా జట్టు.  దీంతో జరగబోయే మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: